india playing XI vs ZIM 1st ODI rahul tripathi likely to make india debutజింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగే తొలి వన్డేకు సిద్దమైంది. ఆసియా కప్ ముందు ఈ సిరీస్ జరుగుతుండటంతో సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగుతోంది. ఆసియాకప్‌కు ఎంపికైన జట్టులో నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ సిరీస్ ఆడుతున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, అక్షర్ పటేల్‌తో పాటు ఆవేశ్ ఖాన్‌లు ఈ సిరీస్‌లో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ రాణించి ఆసియాకప్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో రాహుల్‌కు ఇది లిట్మస్ టెస్ట్‌లా మారింది. <br /> <br />#rahultripathi <br />#indiavszimbabwel <br />#klrahul